రేణు దేశాయ్ కు కోపం తెప్పించిన అభిమాని..

అవును.. ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు మంట తెప్పించాడు ఓ ఫ్యాన్. ఈమెను ఓ పిచ్చి ప్రశ్న అడిగి విసుగు పుట్టించాడు. హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చినా మెగా కోడలిగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. బద్రి.. జానీ లాంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ తో కొన్నేళ్ల పాటు సహజీవనం చేసింది. ఇద్దరు పిల్లలకు తల్లైంది. 2008లో పెళ్లి కూడా చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఇద్దరూ విడిపోయారు. పవన్, రేణు విడిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రేణుదేశాయ్ తో విడిపోయిన తర్వాత అన్నా లెజినీవాను మరో పెళ్లి చేసుకున్నాడు పవన్. కానీ రేణు మాత్రం పిల్లలతో ఒంటరిగా పూణేలో ఉంటుంది. ఆ మధ్య ఈమె ఆరోగ్యం కూడా దెబ్బతింది. తను ఒంటరి అనే భావన కలుగుతుందని.. పిల్లల కోసమైనా తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది రేణు. తనను అర్థం చేసుకునే వాడు వచ్చాడు కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది రేణు దేశాయ్. పనిలో పనిగా ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి కూడా చెప్పుకొచ్చింది ఈమె. తను పిల్లలను వదిలేసి ఒక్కరోజు కూడా ఉండలేనని.. అలాంటిది 100 రోజులు ఎక్కడో వేరే ఇంట్లో ఎలా ఉంటానని చెప్పింది రేణు. అక్కడితో ఆగకుండా తనకు కెమెరా ముందు ఓట్ల కోసం నటించడం రాదని సెటైర్ వేసింది. ఇదే క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్న ఆమెకు చాలా కోపం తెప్పించింది. దాంతో మీకు బుద్ధి జ్ఞానం ఏ మాత్రం ఉన్నా ఇలాంటి ప్రశ్నలు అడగరంటూ మండిపడింది. ఇక తాను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరో అక్కగా నటించబోతున్నట్లు చెప్పింది. దాంతో పాటు దర్శకురాలిగా కూడా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతుంది రేణు దేశాయ్.