English   

సాహో కోసం ఆస్తులు రాయించుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..

Prabhas
2019-07-31 19:00:14

బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాల కోసం ఇండియన్ సినిమా అంతా వేచి చూస్తుంది. ఈయన సినిమాకు ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా క్రేజ్ భారీగానే ఉంది. మార్కెట్ రూపంలో కూడా అది కనిపిస్తుండటంతో ఈయనకు ఎంత కావాలంటే అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. బాహుబలి కోసం అప్పట్లో 40 కోట్లకు పైగా పారితోషికం అందుకుని సంచలనం సృష్టించిన ప్రభాస్.. ఇప్పుడు సాహో కోసం కూడా ఆస్తులు రాయించుకుంటున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఎవరూ అందుకోనంత భారీ రెమ్యునరేషన్ ఇప్పుడు సాహో కోసం ప్రభాస్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఏకంగా 300 కోట్లు ఖర్చు చేసింది యూవీ క్రియేషన్స్. దానికి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరుగుతుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ కలిపి 300 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, టీజర్స్, పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నమ్మకంగా కనిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ చిత్రం కోసం ప్రభాస్ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 50 శాతం వాటా తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ నిజమైతే మాత్రం అదో సంచలనమే. ఎందుకంటే 300 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది సాహో. అందులో 50 శాతం అంటే దాదాపు 150 కోట్లు.. బాలీవుడ్ హీరోలు కూడా అంత పారితోషికం తీసుకోవడం కష్టమే. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల సరసన ప్రభాస్‌ కూడా నిలవనున్నాడు. ఇక ఈయన్ని టాలీవుడ్ హీరోల లిస్టులో వేయడం కూడా సరి కాదు. ఒకవేళ అన్నీ కలిసొచ్చి సాహో కానీ బ్లాక్ బస్టర్ అయిందంటే ప్రభాస్ రేంజ్ అందుకోవడం అంత ఈజీ కాదు.

More Related Stories