English   

రాజమండ్రిలో సందడి చేసిన శంకర్ టీమ్...అందుకేనా ?   

shankar
2019-08-01 07:46:50

ప్రస్తుతం తెలుగు సహా అన్ని బాషల ప్రేక్షకులు కొన్ని సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు, అవి సాహో, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 అలాగే భారతీయుడు 2. ఈ సినిమాల కోసం ఎదురు చూపులు ఎందుకంటే ఈ సినిమాలు ప్రకటించిన నాటి నుండే ఈ సినిమాల మీద జనానినికి విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది, ఇప్పటికే సాహో సినిమా రిలీజ్ కి దగ్గరవుతుండగా మిగతా వాటి మీద ఉన్న క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఈ ఇండియాన్ 2 విషయానికి వస్తే అప్పుడెప్పుడో కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు సినిమా తీయగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా రెండో భాగం తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఒక షెద్యూల్ షూట్ అయ్యిందని కొందరు అంటారు, లేదు అలాంటిది ఏమీ లేదని మరికొందరు అంటుంటారు నిజం ఏమిటో క్లారిటీ లేకున్నా చాన్నాళ్లుగా అయితే ee సినిమా షూట్ జరగడంలేదు. ఆగిపోయిందని ప్రచారం జరుగుతున్నా ఈ మధ్య రకుల్, ప్రియా భవాని శంకర్ లాంటి నటీమణులను తీసుకున్నారని ప్రచారం మొదలుకావడంతో ఆగిందని ప్రచారానికి బ్రేవుకులు వేసినట్టు అయ్యింది.. అయితే నిన్న సడన్ గా దర్శకుడు శంకర్ రాజమండ్రిలో తేలాడు. ఆయన మామూలుగా అలా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది లొకేషన్స్ హంట్ అని ప్రచారం మొదలయ్యింది. ఓ టిఫిన్ సెంటర్ పరిసరాలతో పాటు కొన్ని ప్రదేశాలను సందర్శించిన శంకర్ ఆ ప్రదేశాలను అన్నీ తన టీమ్ కు చూపించి ప్రతి ఒక్క ప్రదేశాన్ని స్కెచ్ లు వేయించి తీసుకెళ్ళారట. సో ఇక్కడ షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరికొందరు emo స్కెచ్ లు వేయించి పట్టుకెళ్లారు కాబట్టి స్టెన్ వేయించుకుని ఎక్కడో స్థూడియోలో షూట్ చేసుకుంటారని అంటున్నారు. ఏమి జరగనుందో మరి వేచి చూడాల్సిందే.

More Related Stories