English   

క్రికెటర్ బయోపిక్ నిర్మాతగా రానా 

rana
2019-08-01 08:27:31

గత కొద్దిరోజుల క్రితం శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కనుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. తమిళనాట మక్కల్ సెల్వన్ గా పేరొందిన విజయ్ సేతుపతి మురళీ పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ను కూడా దాదాపు ఖరారు చేశారు. మురళీధరన్ టెస్ట్ కెరీర్‌లో 800 వికెట్లు తీసి తనకంటూ ఒక రికార్డ్ క్రియేట్ చేసుకొగా దానినే ఇప్పుడు టైటిల్ గా కూడా ఫిక్స్ చేశారని సమాచారం. అయితే ఈ చిత్రం ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తుండగా దార్ ప్రొడక్షన్స్ అనే సంస్థ నిర్మిస్త్తోంది. తాజాగా ఈ సినిమాలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామ్యం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ లో భాగమయినందుకు చాలా ఆనందం ఉన్నదని దగ్గుబాటి రానా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో భారత్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని కొన్ని స్టేడియంలలో షూటింగ్‌ చేస్తారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేస్తారని సమాచారం. తనను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ అప్పగించినందుకు మురళీధరన్‌, నిర్మాతకు విజయ్‌ సేతుపతికి ఈ ట్వీట్ లో రానా థాంక్స్ చెప్పాడు. ఇదే కాక రానా తమిళ్ జెర్సీ రీమేక్ హక్కులు కూడా కొన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విష్ణు విశాల్ ని నటింప చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఫేమస్ క్రికెటర్ కావడంతో 800 సినిమాని దాదాపు అన్ని బాషలలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

More Related Stories