English   

యష్ తో పూరీ...డ్రీమ్ ప్రాజెక్ట్ చేసేస్తాడా ?

yash
2019-08-01 08:38:52

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన పూరి మంచి ఫామ్ లో ఉన్నాడు. హిట్ అవుతుందని అనుకున్నా ఈ రేంజ్ హిట్ అవుతుందని అంచనా వేయకపోవడంతో ఆయన ప్రస్తుతం మంచి మూడ్ లో ఉన్నాడు. ఈ సినిమాతో పాత పూరీ బయటకు రావడంతో ఆయన తన తదుపరి సినిమాల మీద ద్రుష్టి పెట్టాడు. నిజానికి జనగణమన అనే సబీజెక్ట్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పూరీ చెబుతూ ఉంటాడు. ఈ సినిమా కధ మహేష్ తో ఉంటుందని అనుకున్నా ఎందుకో కానీ అది తెరకెక్కలేదు. ఇక మొన్న మహేష్ గురించి నెగటివ్ కామెంట్స్ చేయడంతో మళ్ళీ మహేష్ పిలిచి సినిమా చేసే అవకాశాలు తక్కువే, అందుకే పూరీ తెలివైన ఆలోచన చేసినట్టు చెబుతున్నారు. అదేంటంటే ఆయన ఈ సినిమా స్టోరీని కేజీఎఫ్ తో ఓవర్నైట్ స్టార్ అయిన యాష్ కి చెప్పాడట. ఆయన కూడా కధ విని ఒకే చెప్పాడని అందుకే పూరీ త్వరలోనే స్క్రిప్టింగ్ కూడా మొదలు పెట్టనున్నాడని అంటున్నారు. కన్నడ హీరోలు పునీత్ రాజ్‌కుమార్‌, ఇషాన్‌ల లాంచింగ్ సినిమాలు తెరకెక్కించిన పూరి అక్కడి ప్రెకషకులకి కూడా సుపరిచితుడే. అందుకే యష్‌ హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో లేదా కేజీఎఫ్ 2 కి జరిగే మార్కెట్ ని బట్టి అన్ని భారత భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో పూరి ఉన్నాడని అంటున్నారు.  అయితే ఈ సబ్జెక్టు  మాత్రమే కాక పూరీ బాలకృష్ణతో సినిమా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే యాష్ లైన్ లోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు బాలయ్యతో ఒక సినిమా లాగించవచ్చు  పూరీ భావిస్తున్నట్టు సమాచారం. చూడాలి వీటిలో ఎంతవరకూ నిజం అవుతాయో ?

More Related Stories