English   

విజయ్ సేతుపతి గురించి అంతా పుకార్లేనట ?

Vijay Sethupathi
2019-08-01 10:20:53

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు మక్కల్ విజయ్ సేతుపతి. ఆయన  తెలుగులో కూడా కొన్ని డైరెక్ట్ సినిమాలు ఒప్పుకుని షూట్ లో పాల్గొంటున్నాడు. అయితే ఆయన ఒక సినిమా నుండి తప్పుకున్నాడని రెండ్రోజులుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఉప్పెన అనే సినిమాతో మెగాస్టార్‌ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌  అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు శానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ రేటింగ్స్ సమస్త నుండి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన విలన్‌గా చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్‌ ఈ ప్రాజెక్టు  నుంచి అనివార్య కారణాల వలన తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబందించిన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏంటంటే ఈ వార్తా కేవలం పుకారు అని., ఆయన వచ్చే నెల 16నుండి ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొననున్నారని చెబుతున్నారు. ఈ విషయం మీద చిత్ర యూనిట్ ఏదైనా వివరణ ఇస్తే కానీ జనాల్లో ఏర్పడ్డ ఈ డౌట్ తీరదేమో ?

More Related Stories