English   

బెల్లంకొండ సురేష్ కు అరెస్ట్ వారెంట్.. జబర్దస్త్ షాక్ ఇచ్చిన కోర్ట్..

Bellamkonda Sures
2019-08-01 11:18:45

బెల్లంకొండ సురేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు వరస సినిమాలు నిర్మించి.. స్టార్ హీరోలతో సంచలనాలు సష్టించాడు ఈయన. వరస ప్లాపులు రావడంతో ఈ మధ్య కాలంలో నిర్మాణానికి దూరంగా ఉన్నాడు సురేష్. ప్రస్తుతం కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు బెల్లంకొండ సురేష్. ఇలాంటి సమయంలో ఈయనకు అనుకోని షాక్ ఇచ్చింది కోర్ట్. ఎప్పుడో 2013లో సిద్ధార్థ్, సమంత జంటగా ఈయన నిర్మించిన జబర్దస్త్ సినిమా ఇప్పుడు ఈయనకు చిక్కులు తెచ్చిపెడుతుంది. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తంలో ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పట్నుంచి తిప్పలు తప్పలేదు. చివరికి విడుదలైన తర్వాత ఇది బ్యాండ్ బాజా భారత్ సినిమాకు ఫ్రీమేక్ అని తేలింది. దాంతో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాపై కోర్ట్ కేస్ వేసింది. కోర్టు అది నిజమే అని తేల్చడంతో బెల్లంకొండకు షాక్ తప్పలేదు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన మరో కేస్ కూడా హైలైట్ అయింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ కేస్ వేసిన కారణంగా ఈ చిత్రాన్ని శాటిలైట్ చేయొద్దని.. ఏ ఛానెల్ లో ప్రసారం చేయరాదని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అప్పటికే ఈ చిత్ర హక్కులను 3.5 కోట్లకు ఓ ఛానెల్ కొనేసింది. కానీ కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమా శాటిలైట్ ఆగిపోవడంతో సదరు ఛానెల్ బెల్లంకొండ సురేష్ ను తమ డబ్బు ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే ఈయన మాత్రం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కోర్ట్ ఈయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఇప్పుడు కానీ సరిగ్గా స్పందించకపోతే బెల్లంకొండ సురేష్ జైలుకు వెళ్లడం ఖాయం.

More Related Stories