English   

రణరంగం కోసం రంగంలోకి దిగుతున్న త్రివిక్రమ్ 

 Trivikram
2019-08-01 12:33:17

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రణరంగం. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా కేశవ ఫేమ్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 15 వ తేదీన రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. నిజానికి ముందే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పలు కారణాల వలన వాయిదా పడిన ఈ సినిమా సాహి వెనక్కి వెళ్లడంతో ఆ డేట్ ని కన్ఫర్మ్ చేసుకుడుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకినాడలో జరుగుతుందని దానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్ లు చీఫ్ గెస్ట్ లు గా హాజరు కానున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్నీ సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసింది, కాకుంటే ఇది ప్రీ రిలీజ్ కాదు, కేవలం ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ మాత్రమే, అలాగే అల్లు అర్జున్ ఈ ఈవెంట్ లో పాల్గొనడం లేదు, కేవలం త్రివిక్రమ్ మాత్రమే హాజరు కానున్నారు. ఈ సినిమాని సితార ఎంటెర్టైనెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. వీరి హారికా హాసిని సంస్థే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా నిర్మిస్తోంది. ఈ స్సంస్థ అధినేత చినబాబు, నాగవంశీతో త్రివిక్రమ్ కి ఉన్న సాన్నిహిత్యంతో ఈ ఈవెంట్ ఆహ్వానించగా ఆయన ఒప్పుకున్నారట.

More Related Stories