English   

వరుణ్ తేజ్ కి పోటీ వెళ్లనున్న నాని ?

Nani Varun tej
2019-08-01 13:57:18

జెర్సీ సినిమాతో హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని, తాజాగా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడక తప్పదని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఆగస్ట్ 30న విడుదల చేస్థామని మొదటినుండి చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆగష్టు 15న రిలీజ్ కావలసిన సాహో సినిమాను పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నట్లు  ప్రకటించారు. దీంతో ఆలోచనలో పడిన గ్యాంగ్ లీడర్ టీమ్ సాహో లాంటి భారీ సినిమాతో పోటీకి వెళ్లడం కంటే వాయిదా వేసుకోవడం మంచిదని భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ముందుగా ప్రకటించినట్టుగా ఆగస్ట్ 30న కాకుండా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ మరో చిక్కు ఉంది, అదేంటంటే అదే రోజున వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయినా సాహోతో పోటీ పాడడం కంటే వాల్మీకితో పోటీ పాడడం బెటర్ అని భావిస్తున్న గ్యాంగ్ లీడర్ నిర్మాతలు సినిమాని ఆ రోజుకు పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారమ్. అయితే విషయం మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. చూడాలి మరి ఏమవుతుందో ? 

More Related Stories