English   

కాకినాడ వెళ్ళిన బన్నీ అండ్ టీమ్ 

Allu Arjun
2019-08-01 14:30:45

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ‌ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పక్కా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సబ్జెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోండగా సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అందుకే ఈ సినిమాకి పెద్దగ బ్రేక్ లు లేకుండానే షూట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటిదాకా హైదరాబాద్ లో జరుపుకోగా ఇప్పుడు తాజా షెడ్యూల్ మాత్రం కాకినాడ‌లో జరుపుకోనుంది. ఈ షూటింగ్ కోసం నిన్న బ‌న్నీ కాకినాడ‌కి వెళ్ళ‌గా ఆయ‌న‌కి తన అభిమానులు, మెగా అభిమానుల నుండి గ్రాండ్ వెల్‌క‌మ్ ల‌భించింది. బ‌న్నీపై పూల వ‌ర్షం కురిపించి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు ఆయ‌న ఫ్యాన్స్. ఇక ఈ సినిమా సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తుండగా తాజాగా రావు రమేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఈ విషయం మీద క్లారిటీ రావలసి ఉంది.

More Related Stories