English   

తమిళనాట స్టార్ హీరోలపై పగబట్టిన పరిస్థితులు..

rajinikanth
2019-08-01 17:34:01

తమిళనాట ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. వాళ్లేం చేసినా కూడా అక్కడ సంచలనమే. లేకపోతే అభిమానులే అలా చేస్తుంటారు. సెన్సేషన్స్ క్రియేట్ చేయడంలో తమిళ హీరోలు ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక ఇప్పుడు మరో సంచలన వార్త ఒకటి బయటికి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్‌ తో సహా మరో 14 మంది హీరోల చిత్రాల విడుదల ఆపేయాలని నిర్మాతల మండలి సలహా కమిటీ ఆంక్షలు విధించింది. దాంతో దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు. దానికి తోడు ఫ్యాన్స్ కు అయితే నిద్ర కూడా పట్టడం లేదు. ఇప్పటికే ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేసింది కూడా. అందులో తమిళ నిర్మాతల మండలి సలహా కమిటీ.. సేలం డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఇద్దరూ కలిసి కూర్చుని డిస్కస్ చేసుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. సినిమాల విడుదలలో ఏర్పడుతున్న సమస్యలు.. స్టార్స్ వస్తున్నపుడు చిన్న సినిమాలు పడుతున్న కష్టాలు.. వాటి భవిష్యత్తు గురించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పెద్ద సినిమాలు వచ్చినపుడు చిన్న సినిమాలు నష్టపోతున్నాయని.. అలా జరక్కుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుని.. లోపాలను సరిదిద్దే విధంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు వాళ్లు. ఇందులో భాగంగానే ఇప్పుడు రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్ సహా మరో పది మంది స్టార్ హీరోలు నటించే సినిమాలు సేలంలో 45 డిజిటల్‌ ప్రింట్‌లతోనే విడుదల చేయాలి. అదే విధంగా సేలం సిటీలో 7 థియేటర్స్.. హోసూర్, ధర్మపురి, కృష్ణగిరి, నామక్కల్, కుమారపాళైయం, తిరుసెంగోడు ప్రాంతాల్లో రెండేసి థియేటర్లలోనూ ఇతర ఊర్లలో ఒక్కో థియేటర్‌లో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయం చేసినట్లు తెలిపారు. ఇది స్టార్ హీరోలకు ఊహించని షాకే. చిన్న సినిమాలను కాపాడటానికి తమకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదని వాళ్లు చెబుతున్నారు. ఇక చిన్న హీరోల సినిమాలను 36 డిజిటల్‌ ప్రింట్‌లతోనే విడుదల చేయాలని తీర్మానించింది నిర్మాతల మండలి. సేలం జిల్లాలో బిజినెస్ జరగని చిన్న సినిమాలను సేలం డిస్ట్రిబ్యూటర్ల కౌన్సిలే బాధ్యత తీసుకుని 3 శాతం సర్వీస్‌ చార్జీలు మాత్రమే తీసుకుని విడుదల చేయాలని కూడా వాళ్లు చెబుతున్నారు. మరి వీళ్లు తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి మార్పులకు తావివ్వనుందో..?

More Related Stories