English   

మామా అల్లుళ్ళ ఆరంగ్రేటానికి రంగం సిద్దం !

venkymama
2019-08-01 20:39:45

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్యలు కథానాయకులుగా వెంకీమామ అనే మల్టీ స్టారర్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జై లవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా శర వేగంగా షూట్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో వెంకీకి జోడీగా ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, చైతుకి జంటగా రాశీఖన్నా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రైస్ మిల్లు ఓనర్ గా వెంకటేశ్, మిలటరీ ఆఫీసర్ గా చైతూ కనిపించనున్నట్టు తెలుస్తోంది. సురేశ్‌ బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ప్లాన్ చేసినా అది వర్కౌట్ అయ్యేట్టు కనిపించడంలేదు. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా దర్శకుడు బాబీ పుట్టినరోజు సందర్భంగా ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మామా అల్లుళ్ళు కలిసి ఉన్న ఈ వీడియో చివరిలో ఈ నెలలో టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎఫ్ 2లో వరుణ్ తేజ్ తో కలిసి మల్టీ స్టారర్ చేసి హిట్ కొట్టిన వెంకటేశ్ ఈసారి చైతూతోను కలిసి కూడా హిట్ కొడతాడో లేదో చూడాలి.

 

More Related Stories