English   

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న కౌసల్యా కృష్ణ మూర్తి !

kausalya
2019-08-01 21:00:46

ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో తమిళ్ హీరో శివ కార్తికేయ అతిధి పాత్రలో నటిస్తున్న సినిమా కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్ మీద ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాని కామెడీ సినిమాల డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరిలో పుట్టిన ఓ సాధారణ అమ్మాయి దేశం గర్వించేలా క్రికెట్ ఆటలో ఎలా ఎదిగిందన్న కధాంశంతో కౌసల్య కృష్ణమూర్తి సినిమా తెరకెక్కించారు. ఓ రైతు కడుపున పుట్టిన పేదింటి అమ్మాయి భారత జట్టులో ఎలా స్థానం దక్కించుకుని రాణించిందనే లైన్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఐశ్వర్యా రాజేష్ తండ్రిగా, ప్రత్యేక పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించగా ఆమె తల్లిగా ఝాన్సీ నటిస్తోంది. ఈ మద్యలో ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాగా ఆ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

More Related Stories