English   

కొత్త లుక్ లో మెగా పవర్ స్టార్ !

charan
2019-08-02 07:29:55

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిజీ బిజీగా ఉన్నాడు. ఒక పక్క ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరో పక్క సైరా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలు అయి ఉన్నాడు. అయితే నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో చరణ్ ని క్లిక్ మనిపించారు. ఈ లుక్ లో మీసా కట్టుతో యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సితా రామ రాజు పాత్రలో నటిస్తున్న ఆయన లుక్ చూస్తే కాస్త అనుమానంగానే ఉంది, ఇది సినిమా లుక్ ఏనా లేక మీడియాని డైవర్ట్ చేయడం కోసం ఇలా లుక్ మర్చి బయటకి వచ్చారా అనే అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నాఋ. అయితే ఆయన ముంబై వెళ్ళింది సైరా రిలీజ్ పనుల కోసమని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఆయన వచ్చే ఏడాది వరకూ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం లేదు, దీంతో సైరాని అయినా ప్రేక్షకులు మెచ్చేలా ప్రెజెంట్ చేయాలని చూస్తున్నారు చరణ్. అందుకే ఈ సినిమాకి పలు బాషల కి చెందిన స్టార్ నటులను నటింపచేసారు. ఇక ఏఈ సినిమా వచ్చే అక్టోబర్ రెండున గాంధీ జయంతి నాడు రిలీజ్ చేసి దసరా సీజన్ అంతా వాడుకునే ప్లాన్ చేస్తున్నట్టు విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారం. నిజానికి ఈ సినిమా అంతకు ముందే రిలీజ్ చేయాలని అనుకున్న అనేక రీ షూట్స్ అలాగే అనేక సెట్ ప్రమాదాల వలన వాయిదా పడుతూ వచ్చింది.  

More Related Stories