రచ్చ రేపుతున్న ఇస్మార్ట్...మరో పోకిరీ అవుతుందా ?

ఇస్మార్ట్ శంకర్...పూరీ రామ్ కాంబినేషన్ లో ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఈ సినిమా పేరు ఏంట్రా బాబు ఇలా ఉంది, అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఈ సినిమా రిలీజయ్యి రెండు వారాలు అవుతున్నా కూడా అందరూ ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి మూడు వారాలు అవుతోంది. ఈ రెండు వారాల్లో ఎక్కడా జోరు తగ్గకుండా నడుస్తోంది ఈ సినిమా. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ. 32.70 కోట్లను కొల్లగొట్టిందని, పూరీ క్రేజ్ దృష్ట్యా కర్ణాటక సిటీలలో రిలీజ్ చేసినా ఈ సినిమా రూ. 1.45 కోట్లను ఓవర్సీస్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా మరో కోటి వరకు రాబటట్టిందని చెబుతున్నారు. టెంపర్ సినిమా తర్వాత అసలు విజయం లేని పూరీ జగన్నాథ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ ఊహించిన దాని కంటే పెద్ద హిట్ అయ్యింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ రెండో వరం పూర్తి అయ్యే నాటికే 35.51 కోట్లు వసూలు చేసిందంటే బాక్సాఫస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ విజయ విహారం చేస్తుంద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డియర్ కామ్రేడ్ వచ్చినా అది దెబ్బేయడంతో ఆ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు సాగుతూనే ఉంది. ఈ క్రేజ్ ఇలానే కొనసాగితే పోకిరి తరహాలో భారీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమేమో ?