English   

షాకింగ్...విడిపోయిన రాఘవేంద్ర రావు కొడుకు-కోడలు ?

ragavendrarao
2019-08-02 08:14:44

బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త నుంచి విడిపోతున్నట్లు  నిన్న ప్రకటించింది. అయితే ఇది మన తెలుగు వాళ్ళకి పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆ నటితో అంత పరిచయం లేదు కాబట్టి. కానీ మరో వార్త అందరికీ షాకింగ్ గా అనిపించింది అదేంటంటే దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కొడుకు, కోడలు కూడా విడిపోయారట అది కూడా ఇప్పుడు కాదు రెండేళ్ల క్రితమే. తాజాగా ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో సర్క్యులేట్ అవుతోంది. కానీ ఈ రెండు ఘటనలకీ లింక్ ఉన్నట్టుగా ఒక బాలీవుడ్ వెబ్సైటు రాసిన కధనం సంచలనంగా మారింది. నిజానికి రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి కూడా దర్శకుడే. తెలుగులో ఆయన తీసిన రెండు సినిమాలు (అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో) రెండూ ఆడ లేదు. ఈ రెండు సినిమాలకి కూడా కనికా దిల్లన్ అంటే ప్రకాష్ కోవెలమూడి భార్య స్క్రిప్ట్ ఇచ్చింది. తాజాగా వీరు బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యారు. ఈ ఇద్దరు కలిసి తాజాగా జడ్జిమెంటల్ హై క్యా సినిమాకి పని చేసారు. కంగనా నటించిన ఈ సినిమాకి ఆమె రైటర్ అయితే ప్రకాష్ డైరెక్టర్. సినిమాకి మంచి టాక్ వచ్చినా సైర్గా ఆడటం లేదు. ఆ విషయం పక్కన పెడితే వీరిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయాయామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె సర్కిల్ ముంబై, తన సర్కిల్ హైదేరాబద్ లో ఉండడం వలన విడిపోయామని ప్రకాష్ చెబుతున్నా ఆ బాలీవుడ్ వెబ్ సైట్ మాత్రం ప్రకాష్ కోవెలమూడికి దూరమయిన  కనికా దియా భర్త షాహిల్ తో ఎఫైర్ నడిపిందని అందుకే దియా భర్త నుంచి విడిపోయిందని కధనం ప్రచురించింది, ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఈ ప్రచారం అయితే నిన్నటి నుండి బీ టౌన్ లో రచ్చ రేపుతోంది. 

More Related Stories