English   

రాక్షసుడు సినిమా రివ్యూ

Rakshasudu Review
2019-08-02 14:01:55

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా రాచ్చసన్. ఆ సినిమానే తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్  హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా తమిళ్ లో లాగా అంచనాలను అందుకుందా లేదా  అనేది రివ్యూలో చూద్దాం. 

కధ :

అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) తాను రాసుకున్న సైకో కిల్లర్ స్క్రిప్టును పట్టుకుని దర్శకుడు కావాలన్న ఆశతో నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు. కానీ అతని కధ ఎవరూ వినరు దాంతో తన కుటుంబ సభ్యుల బలవంతం మీద పోలీస్ ఉద్యోగం లో జాయిన్ అవుతాడు. అయితే అదే సమయంలో వరుసగా టీనేజ్ అమ్మాయిల కిడ్నాప్ లు , హత్యలు జరుగుతుంటాయి. వాటిని పరిశోధించే క్రమంలో కృష్ణవేణి (అనుపమ పరమేశ్వరన్) సహాయపడుతుంది. అసలు టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు ? ఎందుకు చేస్తున్నాడు ఆ హత్యల వెనకాల ఉన్న కారణం ఏమిటి ? చివరకు అతడి ఆట కట్టించారా ? లేదా ? అనే విషయమే ఈ సినిమా.

విశ్లేషణ :

మక్కీకి మక్కీ అంటారు చూడండి అదే ఫాలో అయ్యాడు దర్శకుడు, ఈ సినిమా మొదటి షాట్ మొదలు చివరి శత వరకూ తమిళ మాతృక నుండీ మక్కీకి మక్కీ దించేసాడు దర్శకుడు. దర్శకుడు రమేష్ వర్మ దాదాపుగా తమిళ సినిమాని తెలుగు ఇంకుతో జిరాక్స్ తీశాడని చెప్పొచ్చు. అందుకే కథ, స్క్రీన్ ప్లే క్రెడిట్ సైతం ఒరిజినల్ డైరెక్టర్ రామ్ కే ఇచ్చేశాడు. కాబట్టి తెలుగు వెర్షన్ లో మార్పులు చేర్పుల గురించి, వాటిని విశ్లేషించే పని చేయకపోవడమే మంచిది. సస్పెన్స్ థ్రిల్లర్లలో ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఏమవుతుంది ? అనే టెన్షన్  ప్రేక్షకుల్లో క్రియేట్ చేయడం. అలా చేయడంలో రాక్షసుడు సక్సెస్ అయ్యాడు.  

నటీనటులు :

పోలీస్ అధికారి అరుణ్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవించాడు. తమిళ హీరో పోలికలు పెట్టలేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ పాత్రలో అద్భుతంగ నటించింది. ఇద్దరి జోడీ సరిపోయింది. ఈఇద్దరి మధ్య పెద్దగా రొమాన్స్ లేకుండా సరిపోయింది. ఇక సైకో గా నటించిన తమిళ నటుడు శరవణన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజమైన సైకో అంటే నమ్మేస్తారు. మిగిలిన పాత్రల్లో నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిది మేర నటించారు.

సాంకేతిక వర్గం :

రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగులు రాశారు.  ఇక ఈ సినిమంకి అసలైన బలం జిబ్రాన్ నేపథ్య సంగీతమే. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పటికే చాలా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన జిబ్రాన్ ఈ సైకో థ్రిల్లర్ మూవీలో అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది.  విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు సైతం అద్భుతంగా ఉన్నాయి.  సాగర్ సంభాషణలు మామూలే. తమిళ డైలాగుల్ని తర్జుమా చేసినట్లు అనిపించింది.

ఫైనల్ గా : రాక్షసుడు...తప్పక చూడాల్సిన థ్రిల్లర్. 

రేటింగ్ : 3 / 5.

More Related Stories