English   

నటుడు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల కన్నుమూత.. 

Devadas Kanakala Died
2019-08-02 17:29:46

దేవదాస్ కనకాల.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది నటులను పరిచయం చేసిన నట గురువు ఈయన. దేవదాస్ కనకాల ఫిల్మ్ ఇన్సిట్యిట్యూట్ పెట్టి చాలా మందిని పరిచయం చేసాడు దేవదాస్. 74 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు కన్నుమూసాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన తుదిశ్వాస విడిచారు. భార్య లక్ష్మి చనిపోయిన తర్వాత ఈయన బాగా వీక్ అయ్యారు. అప్పట్నుంచీ ఈయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఇక ఇప్పుడు తీవ్ర అనారోగ్యంగా కన్నుమూసారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఈయన పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను పరిచయం చేసిన నటగురువు దేవదాస్. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి నటులతో పాటు ఇంకా చాలా మంది ఆయన నట పాఠశాలలో శిక్షణ తీసుకున్న వాళ్లే. 1945లో జూలై 30 న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే. దర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. రెండేళ్ల కింద దేవదాస్ కనకాల భార్య చనిపోయారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉందంటున్నారు సన్నిహితులు. 
 

More Related Stories