English   

మరో వినూత్న కాన్సెప్ట్ తో సుకుమార్ శిష్యుడి రెండో సినిమా

hari
2019-08-02 20:36:48

తెలుగులో ఈ మధ్య విభిన్న కధలతో సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే నాలుగు ఫైట్ లు, ఒక ఐటెం సాంగ్ అన్నట్టు  నడిచేవి, కానీ ఇప్పుడు కాలం మారింది. సినిమాలు అన్నీ విలక్షణంగా వినూనంగా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మేకర్స్ కూడా కొత్త కదా కధనాల మీద ద్రుష్టి పెడుతున్నారు. 2019లో ఉన్న  అబ్బాయితో తాను ఇంకా 1993లోనే ఉన్నానంటూ ఓ అమ్మాయి ఫోన్‌ మాట్లాడుతుంది ? అది ఎలా ఏమిటి ? అనేది తెలియాలంటే ప్లే బ్యాక్ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ఆ సినిమా మేకర్స్. సుకుమార్ శిష్యుడు దర్శకుడు సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి ప్లే బ్యాక్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆయన దర్శకుడు సినిమాకే కాక సుకుమార్‌ గతంలో మహేశ్‌బాబుతో తెరకెక్కించిన నేనొక్కడినే సినిమాకి స్క్రిప్ట్, నాగచైతన్య 100% లవ్‌ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించాడు ఈయన. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద తెరకెక్కిన దర్శకుడు సినిమా బానే ఉన్నా పెద్దగా ఆడలేదు. ఆయన తాజా సినిమాని పీఎన్‌కే ప్రసాద్‌రావు నిర్మించనున్నారు. ఈ సినిమాలో హుషారు ఫేమ్‌ దినేష్‌ తేజ్, హీరోగా నటిస్తుండగా మల్లేశం ఫేమ్‌ అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. చూద్దాం ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories