ఆర్డీఎక్స్ లవ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న వెంకటేష్ !

తొలి సినిమా ఆర్ఎక్స్ 100తోనే మంచి విజయాన్ని అందుకుని సూపర్ హిట్ అందుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలో చేసింది నెగటివ్ క్యారెక్టర్ అయినా సరే తన అందచందాలతో కుర్రకారు గుండెల్ని గిలి పెట్టి తనకంటూ ఒక స్థానం దక్కించుకుంది ఈ భామ. తరువాత ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడేసుకోకుండా ఆచి తూచి అడుగేస్తోంది. ఆ మధ్య తేజ డైరెక్షన్ లో వచ్చిన సీత సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ భామ ప్రస్తుతం వెంకీమామ సినిమాలో వెంకటేష్ సరసన, డిస్కోరాజా సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక భాను శంకర్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో ‘ఆర్డీఎక్స్ లవ్’ అనే సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు సీక్వెల్గా రాబోతోందని ఆ మధ్య ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ సినిమా వేరని ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ కానుంది. వెంకీ మామలో వెంకటేష్ తో కలిసి నాతొస్తోన్న నేపథ్యంలో ఆయనే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు ఒక ప్రకటన రిలీజ్ చేసింది సినిమా యూనిట్. జూన్ నెలాఖర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలనీ అనుకున్నా షూట్ లెట్ కావడం వలన ఈ సినిమా లేట్ అయ్యింది, సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు,