English   

దేవదాస్ కనకాల అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం !

devdas
2019-08-03 07:34:38

సీనియర్‌ నటుడు, కదిలే నటనా గ్రంధాలయం దేవదాస్‌ కనకాల నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు కన్ను మూశారు. అనారోగ్య కారణాల వలన ఆయన్ని గత నెల 27న కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆనాటి నుండే ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే వైద్యానికి స్పందించకపోవడంతో పాటు పలు అవయవాలు కూడా పనిచేయడం ఆగిపోవడంతో ఆయన తన తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు రాజీవ్‌ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. రాజీవ్‌ సినీ నటుడిగా, కోడలు సుమ టీవీ యాంకర్‌ గా అందరికీ సుపరిచితం. ప్రస్తుతానికి ఆయన భౌతుక కాయం ఆసుపత్రిలోనే ఉంచారు. ఆయన కాయాన్ని ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మణికొండలోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.

More Related Stories