English   

టాలీవుడ్ నెంబర్ వన్ మహేషేనట !

mb
2019-08-03 07:48:08

టాలీవుడ్ లో ఒకప్పుడు పెద్దాయన ఎన్టీఆర్ ని నెంబర్ వన్ హీరో అనేవారు. ఆయన తదనంతరం సూపర్ స్టార్ కృష్ణ కూడా కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా సత్తా చాటారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఏలుబడిలో కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ నడించింది. చిరంజీవి కూడా ఆ స్థానం నుండి తప్పుకోవడంతో టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటోంది. తమ హీరో అంటే తమ హీరో అని అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయాన్నీ తాజాగా గూగుల్ తేల్చేసింది. అదేంటంటే టాలీవుడ్ కి మహేష్ బాబు నెంబర్ అని తేల్చింది. గూగుల్‌లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మహేష్ బాబు నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. అందుకే ఆయన నెంబర్ వన్ అని తేల్చింది గూగుల్. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ నిలవగా మూడవ స్థానంలో రామ్ చరణ్ నాల్గవ స్థానంలో ప్రభాస్ అయిదవ స్థానంలో ఎన్టీఆర్ లు నిలిచినట్లుగా గూగుల్ ప్రకటించింది. అయితే గూగుల్‌లో వెతికినంత మాత్రాన వాళ్లే నెంబర్ వన్ అని నిర్ధారించలేమని అంటున్నారు మిగతా హీరోల అభిమానులు.

More Related Stories