English   

వర్మతో సినిమా ఒప్పుకున్నా అఖిల్ ?

akhil
2019-08-03 08:01:56

హిట్టు కోసం విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్న అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ ఈ మధ్యనే కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో హీరోగా ఇది నాలుగవ చిత్రం కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌ మీద బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. పెద్దగా బ్రేక్స్ లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిల్మ్‌ మేకర్స్ తాపత్రయపడుతున్నారు. అయితే నిజానికి అప్పుడే అఖిల మరో సినిమా కూడా ఒప్పుకున్నాడట. విభిన్న కాదాంశంతో ఆ సినిమా తీసి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ అఖిల్‌కు ఒక ఆసక్తికరమైన కథ చెప్పగా అది అఖిల్ కి బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమా స్క్రిప్టింగ్ మీద కూర్చున్నాడట ప్రశాంత్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అఖిల్ ఐదవ సినిమా ఇదే కావచ్చని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ రాజశేఖర్‌ తో చేసిన కల్కి సినిమా కూడా బంపర్ హిట్ కాకున్నా బాగానే ఆడినది. సో తనకి చెప్పిన కధ కూడా బాగుండడంతో అఖిల్ వెంటనే ఒప్పేసుకున్నాడని అంటున్నారు. ఇక ప్రశాంత్ సినిమా లో అఖిల్‌ లుక్‌ చాలా కొత్తగా, ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటుందని టాక్. లుక్ వేరియేషన్ కోసం బొమ్మరిల్లు భాస్కర్‌ తో అఖిల్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి నిర్మించనున్నారని సమాచారం.

More Related Stories