English   

రంగస్థలం కన్నడ కలెక్షన్స్.. రామ్ చరణ్ కు ఊహించని షాక్.. 

Rangasthalam
2019-08-03 12:26:14

మెగా హీరోలకు తెలుగుతో పాటు కర్ణాటకలో కూడా మంచి ఇమేజ్ ఉంది. అక్కడ కూడా మెగా సినిమాలను తెగ చూస్తుంటారు అభిమానులు. చిరంజీవికి అక్కడ కూడా అభిమాన సంఘలున్నాయి. అందుకే మన సినిమాలకు కర్ణాటకలో కలెక్షన్స్ కుమ్మేస్తుంటాయి. ఇదే నమ్మకంతో ఇప్పుడు రంగస్ధలం సినిమాను కన్నడలో డబ్బింగ్ చేసారు. ఆల్రెడీ ఈ సినిమా అక్కడ తెలుగులో విడుదలై సంచలన విజయం సాధించింది. మళ్లీ ఇదే సినిమాను అనువదించారు. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రానికి అక్కడ ఊహించని ఫలితం వచ్చింది. తెలుగులో 125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం కన్నడలో మాత్రం డిజాస్టర్ అయిపోయింది. ఇప్పటికే కేరళలో డిజాస్టర్ అయిపోయిన రంగస్థలం.. కన్నడలోనూ ఇదే రిజల్ట్ చూసింది. ఏడాది తర్వాత సినిమాను విడుదల చేయడంతో అక్కడ ప్రేక్షకులు పట్టించుకోలేదు. మళయాలంలో అస్సలు ఈ సినిమా కనీసం 20 లక్షలు కూడా వసూలు చేయలేదు. కానీ కన్నడలో మాత్రం చరణ్ కు ఉన్న ఇమేజ్ కు అక్కడ ఆడుతుందేమో అనుకుంటే అక్కడ 60 లక్షలు మాత్రమే వసూలు చేసింది. కానీ సినిమాని కొన్నది మాత్రం కోటి 80 లక్షలకు. అంటే దాదాపు కోటికి పైగా లాస్ వచ్చిందన్నమాట. ప్రమోషన్స్ లేకపోవడం.. లేట్ రిలీజ్ ఈ చిత్ర డిజాస్టర్ కు కారణాలు. మొత్తానికి రామ్ చరణ్ భారీ అంచనాలతో వచ్చిన రంగస్థలం తెలుగులో అంచనాలు అందుకుందేమో కానీ ఇతర భాషల్లో మాత్రం కాదు.

More Related Stories