English   

జ్యోతిక మరో హిట్ కొట్టేసిందిరా నాయనో.. 

Jyothika
2019-08-03 12:44:18

సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. పదేళ్ల తర్వాత మళ్లీ ఆ మధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు వరస సినిమాలు చేస్తూ రచ్చ చేస్తుంది జ్యోతిక. అసలు ఈమె కోసమే ఇప్పుడు దర్శకులు కూడా కథలు సిద్ధం చేస్తున్నారు. పైగా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టుల వైపు అడుగేస్తుంది జ్యోతిక. తాజాగా ఈమె నటించిన జాక్ పాట్ సినిమా నిజంగానే జాక్ పాట్ కొట్టేలా కనిపిస్తుంది. ఈ వారమే విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో జ్యోతికతో పాటు రేవతి కూడా కీలక పాత్రలో నటించింది. ఈ ఇద్దరూ సీనియర్ నటీమణులు కలిసి నటించిన జాక్ పాట్ ప్రేక్షకులకు కూడా బాగానే నచ్చేస్తుంది. దాంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. పిల్లలకు ఓ ఏజ్ వచ్చేంత వరకు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. వాళ్లు పెద్దైన తర్వాత ఇప్పుడు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉండకుండా రప్ఫాడిస్తుంది. ఇప్పటికీ జ్యోతికలో ఏ మాత్రం ఉత్సాహం తగ్గలేదంటున్నారు అభిమానులు. ఇప్పటికీ కథల ఎంపికలో తన ప్రత్యేకతను చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా జాక్ పాట్ సినిమాలో ఇదే చేసింది జ్యోతిక. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉంది ఈ సీనియర్ హీరోయిన్.

More Related Stories