English   

పెళ్లిచూపులు ప్రొడ్యూసర్ కొడుకు లాంచింగ్...రేపు టైటిల్ ప్రకటన

raj
2019-08-04 08:29:58

సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఎవరివైనా అడుగు పెట్టాలని అనుకుంటే సినిమా వారసత్వం ఉంటే అది వారికి అదనపు బలమని చెప్పాలి. ఇండస్ట్రీలో లోటుపాట్లు తెలియడంతో పాటు ఛాన్స్ కోసం సినీ జనాల వెనక తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ విషయం విజయ్ దేవరకొండ, కార్తికేయల  విషయంలో నిజం అయ్యింది. వీరిలో విజయ్ మేనమామ యష్ రంగినేని పెళ్లి చూపులు సినిమా నిర్మించగా, ఆరెక్స్ 100  సినిమాని కార్తికేయ బాబాయ్ అశోక్ రెడ్డి నిర్మించారు.  ఇక ఇప్పుడు రాజ్ కందుకూరి వంతు ఆయన తన సొంత కొడుకును హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు. రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి అమెరికాలో చదువులు పూర్తి చేసి ఇండియాకి తిరిగొచ్చాడు. ఇక్కడకు వచ్చేముందే హీరోగా రాణించడానికి అవసరమైన యాక్టింగ్ - డ్యాన్స్ - ఫైట్స్ వంటి వాటిలో అక్కడే ట్రయినింగ్ తీసుకుని రావడంతో ఆయన కుమారుడు లాంచ్ అయ్యే సినిమాని ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజ్ కందుకూరినే నిర్మిస్తున్నారు. ఈ సినిమాని గతంలో సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో సహాయ దర్శకురాలిగా చేసిన శేష సింధు రావు డైరెక్ట్ చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమిళ ‘96’ ఫేం వర్ష బొల్లమ్మ నటించింది. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా మహానటికి రచయితగా పని చేసిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. ఈ సినిమా టైటల్ రేపు పదకొండు గంటలకి ప్రకటించనున్నారు. 

More Related Stories