ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే ?

ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రెండో వారానికి కూడా చేరింది. ఇక రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండడంతో ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరా అని ఆసక్తి రేగుతోంది. తొలివారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈరెండో వారంలో జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ కాబోతున్నట్టు చెబుతున్నారు. నిజానికి గతం కంటే విరుద్ధంగా రెండో వారంలో ఎనిమిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక షేరు, పునర్నవి భూపాళం, రాహుల్ సిప్లిగంజ్ ఈవారం లిస్టులో ఉన్నారు. వీరిలో నిన్నటి ఎపిసోడ్లో మహేష్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, హిమజ ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యారని నాగ్ ప్రకటించేసారు. ఇక ప్రస్తుతం నామినేషన్లో వరుణ్ సందేశ్, వితికా, జాఫర్, పునర్నవి ఉన్నారు. వీరిలో వరుణ్ హౌస్ కెప్టెన్ గా ఉండడంతో ఆయన సేఫ్ అని పునర్నవి గ్లామర్ వలన షో కి లాభం కాబట్టి ఆమెను కూడా ఉంచుతారని ఈ వారంలో వితికా, జాఫర్‌లలో ఒకరు ఇంటి నుండి బయటకి వెళతారని ప్రచారం జరుగుతోంది. జాఫర్ ఎప్పుడు ఇంటికి వెళదామా అనే మూడ్‌లో ఉండడంతో పాటు గేమ్‌లో సరిగ్గా పాల్గోని కారణంగా ఆయనకి తక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. లీకవుతున్న సమాచారాన్ని బట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది జాఫర్ అని అంటున్నారు.