English   

మరో భారీ రికార్డ్ సృష్టించిన సరైనోడు !

allu
2019-08-04 09:40:44

భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది సరైనోడు సినిమా. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.127 కోట్లు వసూలు చేసిన బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో గత ఏడాదే రిలీజ్ చేసారు. అప్పుడు ఈ సినిమాని యూట్యూబ్ లో  రెండు కోట్ల మంది వీక్షించారు. భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా 'సరైనోడు' కావడం విశేషం. అయితే ఈ సినిమా కొన్ని సాంకేతిక సమస్య వలన ఆ సినిమా డిలీట్ అయిపోగా మళ్ళీ అప్లోడ్ చేశారు. అప్పుడు ఈ సినిమాని మళ్ళీ ఇరవై కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే ఇరవై కోట్ల వ్యూస్ క్రాస్ చేసిన ఈ సినిమాకు అరవై ఒక్క లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 

More Related Stories