English   

కధనం ట్రైలర్ టాక్ !

anu
2019-08-04 10:11:43

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అన‌సూయ భ‌ర‌ద్వాజ్ న‌టిగా కూడా రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో 'కథనం' అనే సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రాజేశ్ నాదెండ్ల అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ చిత్రాన్ని ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా లు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్ ని చూస్తుంటే కొన్ని సినిమాలు జ్ఞాపకం వస్తాయి. కథనం సినిమాలో అనసూయ ఒక దర్శకురాలి పాత్రలో నటించగా ఆమె సినిమా కోసం రాజుకున్న కథ నిజ జీవితంలో జరగుతూ ఉంటుంది. ఆ మర్దర్ మిస్టరీ నేపథ్యంలో ‘కథనం’ సినిమా కథ ఉంరుందని ట్రైలర్ ద్వారా అర్ధం అవుతోంది. ఈ సినిమాను ఆగష్టు 9న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అనసూయ హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో చూడాలి మరి. 

More Related Stories