సరికొత్త లుక్ లో చిరు….అందుకేనా ?

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక గతంలో చూపించిన దానికంటే మరింత ఎక్కువ జోరు చూపిస్తున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల లాంగ్ పొలిటికల్ గ్యాప్ తర్వాత చిరులో కొత్త జోష్ వచ్చింది. ఇప్పుడు వరస చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టులో చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్ర నక్సలైట్ అని ప్రచారం మొదలైంది. ఈ క్యారెక్టర్ కోసం చిరంజీవి కేరళకు వెళ్లి బరువు తగ్గే పనిలో ఉన్నాడనీ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్రలో చిరంజీవి నెరిసిన జుట్టుతో కనిపించనున్నట్టు ప్రచారం మొదలైంది. అయితే ఈరోజు ఉదయం ఆయనకు సంబంధించిన ఒక లుక్ వైరల్ అయ్యింది. సైరా సినిమా కోసం భారీగా ఉన్న ఆయన చిక్కిపోయి సన్నగా అయ్యారు. అయితే అది కొరటాల సినిమా కోసమే అని ప్రచారం జరుుతున్నప్పటికీ దాని మీద క్లారిటీ లేదు. చూడాలి మరి ఈ లుక్ సినిమా కోసమో కాదో ?