ఇది ఆర్ఆర్ఆర్ దోస్తీ...ఫ్రెండ్షిప్ డే స్పెషల్ !

ఈరోజు స్నేహితుల దినోత్సవం కావడంతో సోషల్ మీడియాలో తమ తమ స్నేహితులతో దిగిన పిక్స్ పెట్టి మరీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో సెలెబ్రిటీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వారాహి చలనచిత్రం బ్యానర్ అధినేత నిర్మాత అయిన సాయి కొర్రపాటితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జక్కన్న.. ‘విధి అనుకూలిస్తేనే సాయిగారిలాంటి వ్యక్తిని కలుస్తాం, చిన్నపిల్లాడి మనస్తత్వం, నమ్మకానికి రూపం, వెన్నంటి ఉండే బలం. ఆయన నా భీమ్. ఆయన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ పోస్ట్ చేశారు. అక్కడితో ఆగక ఈ ట్వీట్‌ను ఆర్ఆర్ఆర్ యే దోస్తీ(#RRRYehDosti) అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ హీరో ఎన్ఠీఆర్ కూడా ఇదే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. రామ్‌చరణ్‌తో కలిసి తాను దిగిన ఫోటోను షేర్ చేసిన తారక్ ‘స్నేహం చేసే విషయంలో నెమ్మదిగా వ్యవహరించండి కానీ ఒక్కసారి స్నేహం చేస్తే ఎప్పటికీ వారితో బలమైన బంధాన్ని కొనసాగించండి’ అంటూ సోక్రటిస్ చెప్పిన కోట్‌ను పోస్ట్ చేసిన తారక్, ఇంతకన్నా మా స్నేహం గురించి చెప్పడానికి మరో వాక్యము లేదని కామెంట్ చేశాడు. రామ్ చరణ్ కూడా తారక్ తో దిగిన పిక్ పోస్ట్ చేసి కొన్ని బంధాలు ఏర్పడడానికి సమయం పడుతుందని, కానీ ఏర్పడ్డాక అది జీవితం అంతా అలానే ఉంటుందని, తారక్ tho తనకు అలాంటి బంధమే ఏర్పడిందని ఆయన ట్వీట్ చేశారు.