ఆ ప్రచారం నిజమే....క్లారిటీ ఇచ్చిన మహేష్ డైరెక్టర్ !

మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మంచి ఊపు మీదున్న మహేష్ ఆయన తర్వాత సినిమా సరిలేరు నీకెవ్వరు షూట్ లో పాల్గొంటున్నారు. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొన్ననే కాశ్మీర్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా మొదలయ్యింది. ఈ విషయాన్ని అనీల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ ట్రైన్ డోర్ దగ్గర మహేష్ నిలుచున్న ఫోటోని షేర్ చేశాడు. రెండో షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది. హిలేరియస్‌గా సాగే ట్రైన్ జర్నీ వచ్చే సంక్రాంతికి థియేటర్లో రానుంది. మహేష్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడండని పోస్ట్ చేశారు అనీల్. ఇక ఈ సినిమా మొదలు కాకముందు నుండే ఈ సినిమా కోసం ఒక స్పెషల్ ట్రైన్ సెట్ వేశారని ఈ ట్రైన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉందని అనిల్ కన్ఫర్మ్ చేసినట్టయ్యింది. అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా మహేష్ నటిస్తున్నట్టు ఇంతకు ముందే ప్రకటించినట్టు ఆయన బోర్డర్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో హీరోయిన్ రశ్మికకు, మహేష్ కి మధ్య రొమాంటిక్ కామెడీ ని దర్శకుడు అనిల్ ప్లాన్ చేసాడని చెబుతున్నారు. విజయ్ శాంతి, బండ్ల గణేష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. చూద్దాం కామెడీ ఎపిసోడ్స్ కి పెట్టింది పేరయినా అనిల్ ఈ ట్రాక్ ని ఎంత బాగా తెరకెక్కిస్తున్నారో చూడాలి.