English   

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి మరో సినిమా చేస్తున్న కార్తికేయ

rk
2019-08-04 13:46:00

ఆరెక్స్ 100 సినిమాతో హిట్ కోట్టిన కుర్ర హీరో కార్తికేయ హీరోగా నటించిన తాజా సినిమా గుణ 369. ఆగ‌స్ట్ 2న విడుద‌లైన ఈ చిత్రం మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హిప్పీ సినిమాతో బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆయన పని అయిపోయిందని అనుకున్నారు. కానీ బోయపాటి శిష్యుడి సినిమా పుణ్యమా అంటూ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాడు ఈ కుర్ర హీరో. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమాలో మలయాళీ భామ అన‌ఘ‌ క‌థానాయిక‌గా న‌టిచింది. మంచి సోషల్ మెసేజ్ కి లవ్ స్టోరీ మిక్స్ చేసిన కధ కావడంతో  ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ల‌భిస్తున్నాయి. అయితే తనకు ఇంత మంచి హిట్ ఇచ్చిన మల్లికి మరో సినిమా చేసిపెట్టాలని కార్తికేయ ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. ఆ సినిమా కూడా ఈ ఏడాదే ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్ల‌డించ‌నున్న‌ట్టు  సమాచారం.

More Related Stories