English   

పెళ్లి చూపులు నిర్మాత కొడుకు శివ సినిమా టైటిల్ ఏంటంటే ?

siva
2019-08-04 18:51:08

పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ గా మనందరికీ సుపరిచితం అయిన రాజ్ కందుకూరి కుమారుడు శ్శివ కందుకూరి హీరోగా లాంచ్ అవుతున్న సినిమా పేరు ప్రకటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పాటలను సినిమా టైటిల్స్ గా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది కదా, అదే ఈ సినిమా విషయంలో కూడా ఫాలో అయ్యారు. చలో సినిమాలో సూపర్ హిట్ అయిన చూసీ చూడంగానే నచ్చేశావే అడిగీఅడగకుండా నచ్చేశావే అనే సాంగ్ నుండి చూసీ చూడంగానే అనే మొదటి రెండు పాదాలను తీసుకుని ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శేష సిందు రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి గోపిసుందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. తమిళ్ 96 సినిమాలో నటించిన వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ధ‌ర్మ‌ప‌త క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేయనున్నట్టు  సమాచారం.

More Related Stories