English   

సాహో దెబ్బకు వెనక్కి వెళ్లిన సూర్య !

movie
2019-08-04 19:28:12

విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సూర్య హీరోగా రూపొందిన తాజా చిత్రం కాప్పాన్. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా తమిళంలో కాప్పన్ పేరుతో వస్తున్న ఈ సినిమాని తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సూర్యతో 'వీడొక్కడే', 'బ్రదర్స్' వంటి చిత్రాలను తెరకెక్కించిన కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్యలు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాప్పాన్ అంటే తమిళంలో కాపలాదారుడు అని అర్థం. అందుకే తెలుగులో కూడా బందోబస్త్ అని పేరు పెట్టారు. ఇక ఈ సినిమాలో ప్రధానమంత్రిగా కనిపించే మోహన్‌ లాల్‌ కి సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఆరోజున ప్రభాస్ సాహో సినిమా నాలుగు బాషలలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చుకుంది. తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవయ్యో తారీఖున రిలీజ్ చేయనున్నట్టు  ప్రకటించింది సినిమా యూనిట్. ఇక నాని గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఆరోజునే రిలీజ్ ఉండడంతో ఆ సినిమా ఏమి చేస్తారో చూడాలి మరి.

More Related Stories