రణరంగం ట్రైలర్ టాక్ !

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా మూవీ ‘రణరంగం’. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా యూనిట్ కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయిన త్రివిక్రమ్ ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంటే ఎనభైలలో మొదలవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రభుత్వం మద్యనిషేధాన్ని తీసుకొచ్చిన తరవాత విశాఖపట్నానికి చెందిన ఒక కుర్రాడు అనధికార లిక్కర్ అమ్మకం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి మాఫియా డాన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన పరిస్థితులు, ప్రేమ వంటి అంశాల కలగాపులగమే ఈ ‘రణరంగం’. నిజానికి ఈ ట్రైలర్ లో హింస ఎక్కువగానే ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఫ్లాష్ బ్యాక్‌లో శర్వానంద్‌కు జంటగా కళ్యాణి నటించారు. అయితే ఈ కధలో ఇద్దరు శర్వాలు ఉంటారని ప్రచారం జరిగింది కానీ అలా ఉండకపోకచ్చు. చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ?