English   

బెల్లంబాబుకి షాకిచ్చిన రేణు దేశాయ్...ఆయన అయితేనే ?

sai
2019-08-05 08:19:30

ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లకు హిట్ కొట్టి నిలబడ్డాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా హిట్ అయినా కాకున్నా ఆయన సినిమాలు ఆపేవాడు కాదనుకోండి, అయితే రాక్షసుడు హిట్ కావడంతో ఇప్పుడు మరింత జోరుగా తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. అలాంటి సమయంలో మనోడికి షాక్ తగిలినట్టు  చెబుతున్నారు. ఎందుకంటే బెల్లంకొండ తదుపరి చేయబోయే చిత్రం ఒక బయోపిక్. టైగర్ నాగేశ్వర రావు అనే ఒకప్పటి స్టువర్ట్ పురం దొంగ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. అయితే నిజానికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి, అందుకే ఏe సినిమాని రానా దగ్గుబాటితో చేయాలని ప్లాన్ చేసారు నిర్మాతలు. అయితే రెమ్యునరేషన్ దగ్గర తేడా వచ్చిందో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు కానీ ఈ సినిమా చివరికి బెల్లంకొండ దగ్గరకి వచ్చింది. అయితే నిజానికి రానాతో అనుకున్నప్పుడే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ని అప్రోచ్ అయ్యారట. రేణుకి కూడా పాత్ర నచ్చడంతో పాటు రానా కూడా ఉన్నాడు కాబట్టి, ఈ సినిమా అయితే తన రీ లాంచ్ లా ఉంటుందని భావించిందట. అయితే తాజాగా బెల్లంకొండతో సినిమా చేస్తున్నారని తెలియగానే ఆమె చేయనని చెప్పిందని ప్రచారం మొదలయ్యింది. అయితే అదేమీ లేదని ఆమె మరాఠీలో ఒక సినిమా స్వీయ దర్శకత్వంలో చేస్తున్నారని ఆనందుకే ఈ సినిమా నుండి తప్పుకున్నారని అంటున్నారు. మరి నిజమేమిటో ఆమెకే తెలియాలి.  

More Related Stories