బిగ్ బాస్ ౩ని కూడా వదలని లీకుల భూతం !

2019-08-05 08:38:01
బిగ్ బాస్ త్రీని కూడా లీకుల దెయ్యం వదలనంటోంది. రెండవ సీజన్ లో లాగే ఈ సీజన్ లో కూడా లీకులు నిజమవుతున్నాయి. మొన్న రాత్రి నుండి ప్రచారం జరిగినట్టు అదే నిజమయ్యింది, రెండో వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. మొదటి వారంలో హేమ ఎలిమినేట్ అయితే, రెండో వారంలో జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. రెండో వారంలో చాలా మంది ఎలిమినేషన్ కి నామినేట్ కాగా అయితే చివరకు వరుణ్ సందేశ్, వితిక, జాఫర్ ఎలిమినేషన్ లో నిలిచారు. అయితే ఎట్టకేలకి భార్యాభర్తలు సేఫ్ అయి జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే బయటకు వచ్చి నాగార్జున `బిగ్బాస్ హౌస్లో గ్రూపులున్నాయా?` అని అడిగితే ఖచ్చితంగా ఉన్నాయని జాఫర్ సమాధానం ఇచ్చారు. మరోసారి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం వస్తే వెళతారా? అని నాగార్జున అడగగా తప్పకుండా వెళతానని జాఫర్ సమాధానం ఇచ్చారు.