English   

విజయ్ డిజాస్టర్ల లిస్ట్ లో మరో సినిమా 

 Dear Comrade
2019-08-05 10:26:48

భారీ అంచ‌నాల‌తో రిలీజయిన విజ‌య్ దేవ‌రకొండ డియర్‌ కామ్రేడ్ సినిమా ఈసారి భారీ దేబ్బెసింది. విజ‌య్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నా ఆ తర్వాత కంటెంట్‌ లేదని అర్ధమయ్యాక బాగా దెబ్బ పడింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికి కేవలం 20.49 కోట్ల షేర్ రాబ‌ట్టిం భారీ దేబ్బెసింది. ఇప్ప‌టికే చాలా చోట్ల సినిమాను తీసేశారు. కొన్ని చోట్ల ఆడిస్తున్నా షేర్ కూడా రాని ప‌రిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మ‌రో రూ.14 కోట్లు రావాలి. అది అసాధ్యమని అంటున్నారు. అందుకే సినిమాను విజయ్ డిజాస్ట‌ర్ల‌ లిస్టులో చేర్చుతున్నారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా డియర్ కామ్రేడ్ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఎపీ + తెలంగాణా = 13.66 + రెస్ట్ ఆఫ్ ఇండియా – 3.53 + ఓవర్సీస్ – 3.30 కలిపి వరల్డ్ వైడ్ టోటల్ 20.49 కోట్లతో ఆగిపోయింది. ఒక్క ఏరియాలో కూడా ఈ చిత్రం సేఫ్ జోన్‌కు రాలేదు సరికదా కనీసం వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే తర్వాత రిలీజయిన గుణ, రాక్షసుడు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ కి బ్రేకులు పడ్డట్టే.

More Related Stories