English   

బెల్లంకొండకి బాలీవుడ్ ఆఫర్ ! 

 Bellamkonda
2019-08-05 19:00:42

చాన్నాళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చారు ఒకప్పటి బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్. ఆయన కుమారుడు సాయి శ్రీనివాడ్ నటించిన తాజా చిత్రం రాక్షసుడు సినిమా బాగా ఆడుతుండడంతో ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని సంచలన అంశాలు బయట పెట్టారు. సాయి చేసిన గత 6 సినిమాలు తనకు ఎలాంటి పేరు తీసుకురాలేదనీ, కానీ ఈ ఏడవ సినిమా మంచి పేరు తీసుకొచ్చిందని అన్నారు. అలాగే రాక్షసుడు సాయికి పేరుతో పాటు డబ్బు కూడా తీసుకొస్తుందని అన్నారు. రీమేక్ చిత్రాన్ని ఎక్కడా చెడగొట్టకుండా దర్శకుడు రమేష్ వర్మ తీశారని ఆయనకీ నిర్మాత కోనేరు సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సకాలంలో రాక్షసుడు విడుదల చేయడం వల్ల విజయవంతమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నుండి సాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్ కు 10 లక్షలు ఇస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అలాగే బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేస్తామని, మమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వస్తామని చెబుతూ మెయిల్ పంపారని, అంత గొప్ప సంస్థ నుండి అవకాశం రావడమే గొప్పగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.  ఇది కానీ పక్షంలో తానే ఒక స్ట్రయిట్‌ సినిమాను హిందీలో నిర్మిస్తానని అన్నారు. ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశానని, అది ఇప్పటికి వచ్చిందని ఆయన అన్నారు. 

More Related Stories