English   

వాల్మీకి సినిమాలో భాగమయిన మూడు ఆస్కార్ ల విజేత !

 Robert Richardson valmiki
2019-08-05 19:10:23

ఎఫ్ 2 సినిమా హిట్ కొట్టాక తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ వాల్మీకి. తమిళ చిత్రం జిగర్తాండకు ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ తో పాటు ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మురళి కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ చిత్ర సెట్ కు అనుకోని అతిధి వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇంతకీ ఆ అతిధి ఎవరో తెలుసా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్ సన్. అవును ఈయన రావడమే కాదు ఓ సన్నివేశానికి గౌరవ సినిమాటోగ్రాపర్ గా పనిచేసి చిత్ర యూనిట్ ను ఉత్తేజ పరిచారు. ఈ విషయాన్నీ హరీష్ శంకర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గాడ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, మూడు సార్లు ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తి వాల్మీకి సెట్స్ కి రావడం అంటే ఇంకేమి చెప్పగలం ? యాక్షన్ చెప్పడం తప్ప అంటూ హరీష్ ట్వీట్ చేశారు. ఆయన నిన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని కూడా ప్రత్యేకంగా కలిసి ఆయన పనితనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ఆయన సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

More Related Stories