English   

మూడు ఆస్కార్ ల విజేతకి హైదరాబాద్ లో ఏం పని ?

director
2019-08-05 19:23:08

ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాబర్ట్ రిచర్డ్ సన్ తెలుగు సినిమాల సెట్ లను సందర్శిస్తూ ఉత్తేజ పరుస్తున్నారు. నిన్న మహేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` సినిమా సెట్‌ను సందర్శించిన ఆయన ఈరోజు  మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమా షూటింగ్ లో దర్శనమిచ్చారు. అయితే ఆయన ఎందుకు తెలుగు సినిమా సెట్స్ వెంబడి తిరుగుతున్నాడని అనుమానం రావచ్చు. అదే అనుమానం వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆయన అసలు హైదరాబాద్ వచ్చింది వేరే పని మీదనట. ఖాళీ సమయాల్లో ఆయన ఈ సెట్స్ సందర్సిస్తున్నాడని తెలుస్తోంది. ఆయన హైదరబాద్ వచ్చింది ఎందుకంటే మైక్రో సాఫ్ట్ కంపెనీకి సంబంధించి ఒక కార్పోరేట్ ఫిలిం షూట్ కోసం వచ్చారని చెబుతున్నారు. హైదరాబాద్ శివారు లాలాపేటలో ఈ షూట్ జరుగుతుందట. ఆయన ఆ షూట్ సమయంలో మన తోపుడు బండి మీద కూర్చున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మీరు కూడా చూసెయ్యండి మరి. జె ఎఫ్ కె(1991),ది ఏవియేటర్(2004), హ్యూగో(2011) చిత్రాలకు గాను రిచర్డ్ సన్ ఆస్కార్ అవార్డు పొందటం జరిగింది.

More Related Stories