English   

రేపటి నుండి షూట్ కి వెళ్లనున్న వీ !

v
2019-08-05 19:51:55

విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ వి. నివేదా థామస్,అదితిరావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు, ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా లాంటిది ఏమీ పడలేదని రేపటి నుండి ఈ సినిమా షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. హైదరబాద్ శివార్లలోని ప్రగతి రిసార్ట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని చెబుతున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉండే సీరియల్ కిల్లర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో సుధీర్ బాబు పోలీస్ గా నటిస్తున్నారు. కిల్లర్ నానిని వెంటాడే పోలీస్ గా సుధీర్ పాత్ర ఉండబోతుందట. ఇక ఈ మధ్యనే ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తండ్రి శ్రీకాంత శర్మ కన్నమూసారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్న‌ ఆయన జులై 25 రాత్రి 2.30 గంటల సమయంలో మ‌ర‌ణించారు. అయినా నిర్మాతకు నష్టం చేకూర్చకూడదు అనే ఉద్దేశంతో ఆయన షూట్ ఏర్పాటు చేసినట్టు సమాచారం.

More Related Stories