English   

బిగ్ బాస్ హౌస్ లోకి తమన్నా అందుకే వచ్చిందా...

biggboss
2019-08-06 07:23:57

తమన్నా అంటే ఇన్నాళ్లూ కేవలం సినిమా హీరోయిన్ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు తమన్నా సింహాద్రి గుర్తుకు వస్తుంది. ఇన్నిరోజులు ట్రాన్స్ జెండర్ గా సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేస్తుంది. గొడవలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి కావాలని పడటం.. మరొకటి అనుకోకుండా జరగడం.. ఇప్పుడు కావాలని పర్సనల్ టార్గెట్ చేస్తూ అందరినీ రెచ్చగొడుతుంది. ముఖ్యంగా రవి కృష్ణ, అలీ రెజాపై కావాలనే వ్యక్తిగతంగా దూషిస్తూ రోజు రోజుకు తన ఇమేజ్ దిగజార్చుకుంటుంది. తాజా ఎపిసోడ్ లో కూడా రవి కృష్ణను టార్గెట్ చేస్తూ నానా మాటలు అనేసింది తమన్నా సింహాద్రి. కావాలని గొడవలు పెట్టుకుని ఇంట్లో అట్మాస్పియర్  దెబ్బతీస్తుందని తోటి కంటెస్టెంట్స్ కూడా ఈమెపై కోపంగా కనిపిస్తున్నారు. అందుకే ఈ వారం ఎక్కువగా ఓట్లు వేసి నామినేషన్ కు పంపించారు. మరోవైపు ఈ వారం అందరికంటే ఎక్కువ డేంజర్ జోన్ లో ఉన్నది కూడా తమన్నా సింహాద్రినే. ఈమె బయటికి రావడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ఆమె బిహేవియర్ కూడా కారణమే.. ఇంట్లో ఇష్టం వచ్చినట్లు ఉండటం.. ఎవరినీ లెక్క చేయకపోవడం.. బిగ్ బాస్ నియమాలను కూడా ఉల్లంఘించడం ప్రతిరోజు చేస్తుంది. దాంతో తమన్నా బయటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈమె నుంచి బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మరింత ఎక్కువ కావడం ఖాయమే అనిపిస్తుంది.

More Related Stories