English   

నాగార్జున, చిరంజీవి ఆ విషయంలో తోపులు..

nag
2019-08-06 07:46:36

వయసు దాచిపెట్టే యంత్రాన్ని దేవుడు కొందరికి ప్రత్యేకంగా ఇచ్చినట్టు ఉన్నాడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో నాగార్జున, చిరంజీవిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇద్దరి వయస్సు 60 పైనే ఉంది. కానీ వాళ్ళిద్దరు ఇంకా 40 లోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. నాగార్జున అయితే మరీను.. ఆయన ఇంకా 30ల్లో ఉన్నట్లు తన గ్లామర్ మెయిన్టైన్ చేస్తున్నాడు. ఎన్ని ఎక్సర్ సైజులు చేసినా ఎంతగా జిమ్ముకి వెళ్లిన కూడా 60 ఏళ్లు దాటితే మొహంలో కచ్చితంగా ఆ ఛాయలు కనిపిస్తాయి. కానీ నాగార్జున విషయంలో మాత్రం అది జరగడం లేదు. ఈయన వయసు రానురాను ఇంకా తగ్గుతూ వెళుతుంది కానీ పెరగడం లేదు. మొన్న మన్మధుడు ప్రీ రిలీజ్ లో కూడా దీనిపై సెటైర్లు వేశారు. 1990 లో ఉన్న నాగార్జున ఇప్పుడు మరింత యంగ్ గా తయారయ్యారు అంటూ చిత్ర యూనిట్ ఈయనపై కొన్ని వీడియోలు రూపొందించింది. ఇక చిరంజీవి కూడా అంతే. 64 ఏళ్ళ మెగాస్టార్ ఇప్పటికీ అదే కుర్ర లుక్ లో కనిపిస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఆయన ఫొటోస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీని కూడా షేక్ అయ్యేలా చేస్తున్నాయి. కొరటాల శివ సినిమా కోసం మరింత బరువు తగ్గి కుర్రాడిలా మారిపోతున్నాడు మెగాస్టార్. మొత్తానికి అటు నాగార్జున.. ఇటు చిరంజీవి వయస్సును దాచేసే యంత్రాన్ని తమ ఇంట్లోనే దాచేసుకున్నారు ఏమో అనిపిస్తుంది. వాళ్లు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా యంగ్ అయిపోతుంటే.. వాళ్లను చూసి మిగిలిన హీరోలు వారెవా అనుకుంటున్నారు.

More Related Stories