English   

కుర్ర హీరోతో రొమాన్స్ కి రెడీ అయిన అనుష్క..

anu
2019-08-06 08:50:50

భాగమతి సినిమా తర్వాత చాలా రోజుల పాటు కనిపించని అనుష్క.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోతుంది. కేవలం సీనియర్ హీరోలతోనే కాకుండా కుర్ర హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది జేజమ్మ. ఇందులో భాగంగానే ఇప్పుడు నాగశౌర్య హీరోగా నటించబోయే సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా.. కాంబినేషన్ కొత్తగా ఉందని ట్రై చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించబోతున్నాడు అని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు దర్శకులు మూడు విభిన్నమైన కథలతో ఒక సినిమా నిర్మించబోతున్నాను అంటూ ప్రకటించాడు రాఘవేంద్రరావు. ఈ మూడు వేరు వేరు సినిమాలు కాకుండా ఒకే సినిమాలో మూడు కథలు ఉంటాయని తెలుస్తోంది. అందులోనూ మూడు కథలను ముగ్గురు విభిన్నమైన దర్శకులు తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే క్రిష్, బి.వి.ఎస్.రవి రెండు కథలను డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక మూడో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. ఈ మూడు కథలకు ఇంటర్ లింక్ పెట్టి పూర్తి సినిమాగా మలచనున్నాడు రాఘవేంద్రరావు. అయితే ఈ మూడు కథల్లోనూ నాగశౌర్య హీరోగా నటించబోతున్నాడని హీరోయిన్ గా అనుష్క కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గాని నిజమైతే ఈ ఇద్దరి జోడి తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

More Related Stories