English   

బండ్ల గణేష్ ఈజ్ బ్యాక్.. మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్..

Bandla Ganesh
2019-08-06 11:45:54

బండ్ల గణేష్ అంటే ఒకప్పుడు కేవలం కమెడియన్ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. కానీ ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారాడు. అక్కడితో ఆగకుండా తనకు తానే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అంటూ ఒక బిరుదు కూడా ఇచ్చుకున్నాడు. ఈయన నిర్మించిన సినిమాల్లో గబ్బర్ సింగ్ మాత్రమే బ్లాక్ బస్టర్. ఆ సినిమా తర్వాత టెంపర్, గోవిందుడు అందరివాడేలే, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి. ఏమైందో కారణం తెలియదు కానీ టెంపర్ తర్వాత ఈయన నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. కొన్నేళ్ల నుంచి సినిమాలు నిర్మించడం గానీ.. సినిమాల్లో నటించడం కానీ పూర్తిగా తగ్గించేసాడు బండ్ల గణేష్. ఆ మధ్య రాజకీయాలు అంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి నానా హంగామా చేశాడు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ తీసుకుని తాను గొంతు కోసుకుంటానంటూ సంచలన కామెంట్స్ కూడా చేశాడు. ఓడిపోయిన తర్వాత ఆయన జాడ కనిపించడం లేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ కమెడియన్. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈయన కోసమే ప్రత్యేకంగా ఒక కామెడీ క్యారెక్టర్ క్రియేట్ చేశాడని తెలుస్తుంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ తో జత కలిసాడు బండ్ల గణేష్. ఖచ్చితంగా ఈ సినిమాతో మళ్లీ తాను బిజీ అవుతానని ధీమాగా చెబుతున్నారు బండ్ల గణేష్. మరి ఈయన నమ్మకాన్ని సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

More Related Stories