English   

అందుకేనేమో ప్రభాస్ ని డార్లింగ్ అనేది !

 Prabhas
2019-08-06 12:40:19

ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తూన్నట్టు ముందుగా ప్రకటించారు. అయితే, అదే రోజున బాలీవుడ్‌లో ‘మిషన్ మంగళ్’, ‘బాట్లా హౌస్’ సినిమాలు విడుదలవుతున్నాయి. వాటితో పోటీపడటం ఇష్టంలేకనో లేక వీఎఫ్ఎక్స్ పనులు బాకీ పడ్డాయో తేలేదు కానీ ‘సాహో’ సినిమాని ఆగస్టు 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించి రిలీజ్ డేట్ మార్చారు. ఈ క్రమంలో ఆగస్టు 30న తెలుగులో విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు తేదీలను మార్చుకున్నాయి. శర్వానంద్ ‘రణరంగం’, అడివి శేష్ ‘ఎవరు’ సినిమాలను ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. అలా ఒకటి రెండు సినిమాలు కాక ఆగష్టు నెల, సెప్టెంబర్ నెలలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ మాత్రం వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 30న ‘సాహో’ విడుదలవుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ సినిమాల విడుదల తేదీలను రీషెడ్యూల్ చేసుకున్న నటులు, నిర్మాతలు, దర్శకులకు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టిన ఆయన ‘‘ఆగస్టు 30న వస్తోన్న ‘సాహో’కి దారిచ్చి తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకున్న నటులు, నిర్మాతలు, దర్శకులు అందరికీ చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ ‘సాహో’ టీం రుణపడి ఉంటుంది. మీ సినిమాలన్నీ మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. లవ్ అండ్ రెస్పెక్ట్ తో ’’ అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ కూడా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లకి ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు అందుకే అన్నా నిన్ను డార్లింగ్ అనేది అంటూ ఎత్తేస్తున్నారు.

More Related Stories