English   

జోడీ రిలీజ్ డేట్ లాక్ !

Jodi
2019-08-06 14:02:55

ప్రేమ కావాలి, లవ్లీ వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది సాయి కుమార్‌. సాయి కుమా నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈ మధ్యనే బుర్ర కధ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా కధ పరంగా బానే ఉన్నా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఆయన మరో లవ్‌స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. నూతన దర్శకుడు విశ్వనాథ్‌ అరిగెల తెరకెక్కించిన ‘జోడీ’ అనే సినిమాలో ఆది సాయికుమార్,  ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించారు. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్తా మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పద్మజ, సాయి వెంకటేశ్‌ గుర్రం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ మధ్యన విడుదలైన ఈ ‘జోడి’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ‘జోడి’ చిత్ర ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయని అంటున్నారు.

More Related Stories