బిచ్చగాడు డైరెక్టర్ నుండి ఎరుపు పసుపు పచ్చ

బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయ్యారు విజయ్ అంటోనీ. ఆయన హీరోగా నటించిన ఆ సినిమాకి మంచి పేరు వచ్చినా ఆయన పేరు మాత్రమే తెలుగు ప్రేక్షకులకి బాగా రిజిస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా డైరెక్టర్ శశి మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అయితే స్ట్రెయిట్ సినిమా అనుకునేరు కాదండోయ్, తమిళ సినిమానే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘బిచ్చగాడు’ డైరెక్టర్ శశి తెరకెక్కించిన కొత్త తమిళ చిత్రం ‘సివప్పు మంజళ్ పచ్చై’. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ సినిమాని రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘ఎరుపు పసుపు పచ్చ’ టైటిల్‌తో అనువదిస్తున్నారు. నిజానికి ‘ఎరుపు పసుపు పచ్చ’ ఈ మూడు రంగులను మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడీ రంగులనే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారన్న మాట. ఈ సినిమాని సెప్టెంబర్ మొదటి వారంలో తమిళ, తెలుగు బాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా కూడా బిచ్చగాడు లాగా కనెక్ట్ అవుతుందో లేదో ?